శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 17:56:34

రెండోసారి గెలవడం సంతోషంగా ఉంది: మనీశ్‌సిసోడియా

రెండోసారి గెలవడం సంతోషంగా ఉంది: మనీశ్‌సిసోడియా

న్యూఢిల్లీ: ఆప్‌ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా పట్పార్‌గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరోసారి  ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సందర్భంగా మనీశ్‌ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ..నేను రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం సంతోషంగా ఉంది. బీజేపీ విద్వేషపూరితమైన రాజకీయాలు చేయాలని ప్రయత్నించినా..ఢిల్లీ ప్రజలు మాత్రం తమ కోసం పనిచేసే ఆప్‌ ప్రభుత్వానికి పట్టం కట్టారని మనీశ్‌ సిసోడియా అన్నారు. కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ అభ్యర్థి రవి నెగి ముందంజలో కొనసాగుతూ మనీశ్‌ సిసోడియాపై ఆధిక్యాన్ని ప్రదర్శించారు. అయితే 11వ రౌండ్‌ ముగిసేసరికి  మనీశ్‌ సిసోడియా ఆధిక్యంలోకి వచ్చేశారు. మనీశ్ సిసోడియా  3వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.  


logo