గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 13:04:24

29న రాఫెల్ రాక‌.. ద్రువీక‌రించిన ఐఏఎఫ్‌

29న రాఫెల్ రాక‌.. ద్రువీక‌రించిన ఐఏఎఫ్‌

హైద‌రాబాద్‌: రాఫెల్ యుద్ధ విమానాలు ఈనెల 29వ తేదీన భార‌త వాయుద‌ళంలో చేర‌నున్నాయి. ఈ విష‌యాన్ని ఐఏఎఫ్ ద్రువీక‌రించింది. మొత్తం అయిదు యుద్ధ విమానాలు ఐఏఎఫ్ ద‌ళంలో చేర‌నున్నాయి. అయితే ఇండ‌క్ష‌న్ సెర్మ‌నీ మాత్రం ఆగ‌స్టు నెల‌లో జ‌ర‌గ‌నున్న‌ట్లు ఐఏఎఫ్ చెప్పింది. ఫ‌స్ట్ బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాల‌ను ఈనెల 29న అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేష‌న్‌లో ఇండ‌క్ట్ చేయ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం చైనాతో ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం నెల‌కొన్న నేప‌థ్యంలో.. రాఫెల్ జెట్స్‌ను ల‌డ‌ఖ్ సెక్టార్‌లో మోహ‌రించే అవ‌కాశాలు ఉన్నాయి. ఎయిర్‌ఫోర్స్ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం రోజున తొలి రాఫెల్‌ను ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌కు అప్ప‌గించారు. 


logo