మంగళవారం 07 జూలై 2020
National - Jun 26, 2020 , 16:13:10

రహదారిపై అత్యవసరంగా దిగిన ఐఏఎఫ్‌ హెలికాఫ్టర్‌

రహదారిపై అత్యవసరంగా దిగిన ఐఏఎఫ్‌ హెలికాఫ్టర్‌

ఢిల్లీ : ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ చాపర్‌ అత్యవసరంగా హైవే పై ల్యాండ్‌ అయింది. ఈ ఘటన హర్యానా రాష్ట్రం సోనిపట్‌ జిల్లాలోని సోనిపట్‌ ఎక్స్‌ప్రెస్‌ వే పై ఈ ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. సాంకేతిక సమస్య కారణంగా ఐఏఎఫ్‌ చీతా హెలికాఫ్టర్‌ అత్యవసరంగా రహదారిపై దిగింది. హిండన్‌ ఎయిర్‌బేస్‌ నుంచి టెక్నికల్‌ టీంను సైతం అక్కడికి పంపించారు. టోల్‌ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమస్య పరిష్కారం వెంటనే హెలికాఫ్టర్‌ టేకాఫ్‌ తీసుకుంది.  


logo