‘మైనే ప్యార్‌కియా’ సినిమాతో దేశాన్ని ఉర్రూతలూగించిన భాగ్యశ్రీ గుర్తుందిగా! ఈ సౌందర్యరాశి అడపాదడపా సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంది. తాజాగా చర్మ సౌందర్యానికి సంబంధించిన చిట్కాలు కొన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది భాగ్యశ్రీ. చర్మ సంరక్షణకు కేవలం పైపూతలపై ఆధారపడొద్దని చెప్పుకొచ్చింది. ‘శరీరంలో ఉత్పత్తి అయ్యే కొలెజన్ ప్రొటీన్ చర్మం పాలిపోకుండా, ముడతలు పడకుండా రక్షిస్తుంది. స్కిన్‌కు నిగారింపు తెస్తుంది. అంతేకాదు, ఇది కీళ్లకు లూబ్రికెంట్‌గా పనిచేస్తుంద’ని స్కిన్‌కేర్ పాఠాలు చెప్పింది. నారింజ, స్ట్రాబెర్రీ, టమాట, ఆకుకూరలు, సీఫుడ్ పుష్కలంగా తింటే కొలెజన్ ఉత్పత్తి పెరుగుతుందని సలహా ఇచ్చింది భాగ్యశ్రీ.