గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 13:50:29

మాజీ ఫైట‌ర్ పైల‌ట్ వందో పుట్టిన రోజును సెల‌బ్రేట్ చేసిన‌ ఐఏఎఫ్

మాజీ ఫైట‌ర్ పైల‌ట్ వందో పుట్టిన రోజును సెల‌బ్రేట్ చేసిన‌ ఐఏఎఫ్

న్యూఢిల్లీ: మాజీ ఫైట‌ర్ పైల‌ట్, లివింగ్ లెజెండ్ స్క్వాడ్రన్ లీడర్ దలీప్ సింగ్ మజిథియా (రిటైర్డ్) సోమ‌వారం వందో ఏట అడుగుపెట్టారు. ఆయ‌న 100వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా భారత వైమానిక దళం (ఐఎఎఫ్) ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసింది. ఐఏఎఫ్ సిబ్బంది స్వ‌యంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. దలీప్ సింగ్ 1947 ఆగస్టులో పదవీ విరమణ చేశార‌ని, అత్యంత కాలం జీవించిన మాజీ ఫైటర్ పైలట్‌గా ఆయ‌న గుర్తింపు పొందార‌ని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. వాయుసేనాధిప‌తి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా కూడా ఎయిర్ ఫోర్స్ యోధుల తరపున ఆయ‌న‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.  'పురాతన' ఐఏఎఫ్ ఫైటర్ పైలట్‌గా గుర్తింపు పొందిన స్క్వాడ్రన్ లీడర్ దలీప్ సింగ్ మజిథియా 1947 ఆగ‌స్టులో భార‌త‌దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.
logo