మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 20, 2020 , 14:35:57

లైట్ కంబాట్ హెలికాప్ట‌ర్‌లో ఎగిరిన ఐఏఎఫ్ చీఫ్‌

లైట్ కంబాట్ హెలికాప్ట‌ర్‌లో ఎగిరిన ఐఏఎఫ్ చీఫ్‌

హైద‌రాబాద్‌:  స్వ‌దేశీయంగా త‌యారు చేసిన లైట్ కంబాట్ హెలికాప్ట‌ర్‌లో ఇవాళ వైమానిక ద‌ళ చీఫ్ మార్ష‌ల్ రాకేశ్ కుమార్ సింగ్ భ‌దౌరియా విహ‌రించారు.  బెంగుళూరులో ఆయ‌న ఎల్‌సీహెచ్ హెలికాప్ట‌ర్‌లో సోర్టీ నిర్వ‌హించారు.  సుమారు 45 నిమిషాల పాటు ఆయ‌న ఆ హెలికాప్ట‌ర్‌లో ఎగిరారు.  భ‌విష్య‌త్తులో భార‌త ర‌క్ష‌ణ ద‌ళాల్లోకి లైట్ కంబాట్ హెలికాప్ట‌ర్‌ను ఇండ‌క్ట్ చేయ‌నున్నారు. ప‌శ్చిమ ప్రాంతాల్లో రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న బెంగుళూరు వెళ్లారు.  గురువారం రోజున భ‌దౌరియా .. అపాచీ హెలికాప్ట‌ర్‌లో సార్టీ నిర్వ‌హించారు. వెస్ట్ర‌న్ సెక్టార్‌లో ఉన్న ద‌ళాల సంసిద్ధ‌త‌ను ఆయ‌న స‌మీక్షించారు. వెస్ట్ర‌న్ బేస్‌ల్లో ఉన్న ఎయిర్ వారియ‌ర్ల‌తో ఈనెల 18న ఆయ‌న స‌మావేశం అయ్యారు. లైట్ కంబాట్ హెలికాప్ట‌ర్‌ను తొలిసారి .. బెంగుళూరులోని హెచ్ఏఎల్ సంస్థ డిజైన్ చేసింది.  భార‌తీయ సైనిక ద‌ళాల‌కు త‌గిన‌ట్లు ఈ హెలికాప్ట‌ర్‌ను డెవ‌ల‌ప్ చేశారు.  ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ హెలికాప్ట‌ర్ త‌యారీ జ‌రుగుతోంది.