ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 14:03:22

సరిహద్దులోని వైమానిక కేంద్రం సందర్శనకు బయలుదేరిన ఐఏఎఫ్ చీఫ్

సరిహద్దులోని వైమానిక కేంద్రం సందర్శనకు బయలుదేరిన ఐఏఎఫ్ చీఫ్

న్యూఢిల్లీ: భారత వాయుసేన (ఐఏఎఫ్) అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా సరిహద్దులోని వైమానిక కేంద్రాన్ని పరిశీలించనున్నారు. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌లోని ఫ్రంట్‌లైన్ వైమానిక స్థావరం సందర్శన కోసం గురువారం ఆయన మిగ్ 21 బైసన్ యుద్ధ విమానంలో బయలుదేరారు. పశ్చిమ సరిహద్దులోని వాయుసేన కేంద్రం సంసిద్ధతను భదౌరియా సమీక్షించనున్నారు. స్క్వాడ్రన్స్, ఎయిర్ స్టేషన్స్ యూనిట్లలోని ఎయిర్ క్రూ, కంబాట్ సిబ్బందిని ఆయన కలుస్తారని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు.


logo