బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 21, 2020 , 12:50:00

అళ‌‌గిరిని బీజేపీలోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తా: కేపీ రామ‌లింగం

అళ‌‌గిరిని బీజేపీలోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తా: కేపీ రామ‌లింగం

చెన్నై: త‌మిళ‌నాడులో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో అక్క‌డ అప్పుడే నేత‌ల క‌ప్పగంతులు మొద‌ల‌య్యాయి. తాజాగా డీఎంకే బ‌హిష్కృత నేత‌, మాజీ ఎంపీ కేపీ రామ‌లింగం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చెన్నైలోని బీజేపీ కార్యాల‌యంలో ఆయ‌న పార్టీ కండువా క‌ప్పుకున్నారు. అంతేగాక‌ త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు, డీఎంకే అధినేత స్టాలిన్‌ సోద‌రుడు ఎంకే అళ‌గిరిని కూడా బీజేపీలోకి తీసుకొస్తాన‌ని రామ‌లింగం చెప్పారు. 

అళ‌గిరితో నాకు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. త్వ‌ర‌లోనే అయ‌న‌ను కూడా బీజేపీలోకి తీసుకొచ్చే ప్ర‌యత్నం చేస్తా అని కేపీ రామ‌లింగం పేర్కొన్నారు. కాగా పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నాడంటూ డీఎంకే ఇటీవ‌ల రామ‌లింగంను స‌స్పెండ్ చేసింది. దాంతో ఆయ‌న తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.       

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.