బుధవారం 02 డిసెంబర్ 2020
National - Sep 20, 2020 , 19:29:36

కనీస మద్దతు ధరకు ముప్పుగా ఉంటే రాజీనామా చేస్తా: దుష్యంత్ చౌతాలా

కనీస మద్దతు ధరకు ముప్పుగా ఉంటే రాజీనామా చేస్తా: దుష్యంత్ చౌతాలా

చండీగఢ్: వ్యవసాయ బిల్లుల వల్ల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) వ్యవస్థకు ముప్పు ఎదురైన రోజున తన పదవికి రాజీనామా చేస్తానని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా తెలిపారు. పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ బిల్లులలో కనీస మద్దతు ధర వ్యవస్థను నిలిపివేసే ప్రస్తావన ఏదీ లేదని ఆయన చెప్పారు. ఈ బిల్లుల కారణంగా ఎంఎస్పీ వ్యవస్థకు ప్రమాదం ఎదురైన రోజున తన పదవి నుంచి తప్పుకుంటానని ఆయన స్పష్టం చేశారు. జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధ్యక్షుడైన దుష్యంత్ చౌతాలా మద్దతుతో హర్యానాలో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. అయితే అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతు వ్యతిరేక విధానలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం నుంచి దుష్యంత్ తప్పుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులపై ఆయన స్పందించారు. కనీస మద్దతు ధర వ్యవస్థకు ప్రమాదం ఎదురైన రోజున తన పదవి నుంచి తప్పుకుంటానని దుష్యంత్ చౌతాలా చెప్పారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.