శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 11:45:45

నేను దవాఖానకు రాను.. మొండికేసి వృద్ధురాలు..!

నేను దవాఖానకు రాను.. మొండికేసి వృద్ధురాలు..!

శంకరపట్నం : కరోనా వైరస్‌పై భయం, అపోహలు గందరగోళానికి గురిచేస్తున్నాయి.  భయాందోళనతో కొందరు దవాఖానలో చేరేందుకు నిరాకరిస్తుండగా.. మరి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నంలో కరోనా సోకిన ఓ వృద్దురాలు దవాఖానకు వెళ్లేందుకు మొండికేసింది. ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో వైద్యాధికారులు ఆమెను అంబులెన్సులో కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. శనివారం అంబులెన్సులో దవాఖానకు వెళ్తూ మార్గమధ్యలో మూత్ర విసర్జన పేరుతో కిందకు దిగింది. ఆపై అక్కడి నుంచి తప్పించుకుని శంకరపట్నం చేరుకుంది.

అక్కడి బస్టాండ్ పరిసరాల్లో  వృద్దురాలు తిరుగుతున్నట్లు వైద్య సిబ్బందికి సమాచారం అందడంతో  వారు అక్కడికి చేరుకొని ఆ వృద్ధురాలిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆమె రోడ్డు పైన బైఠాయించిన దవాఖానకు వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో సిబ్బంది వృద్ధురాలికి నచ్చజెప్పడంతో ఎట్టకేలకు అయిష్టంగానే అంబులెన్సు ఎక్కింది. ప్రస్తుతం కరీంనగర్ దవాఖానలో చికిత్స పొందుతోంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo