మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 12:29:39

ఆల‌య భూమిపూజలో పాల్గొంటున్నా: మ‌హా సీఎం థాక్రే

ఆల‌య భూమిపూజలో పాల్గొంటున్నా: మ‌హా సీఎం థాక్రే

ముంబై: వ‌చ్చే నెల 5న అయోధ్య‌లో జ‌ర‌గ‌నున్న శ్రీరాముని ఆల‌య నిర్మాణ భూమిపూజ కార్య‌క్ర‌మంలో తాను పాల్గొంటున్నాని మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ థాక్రే ప్ర‌క‌టించారు. శివ‌సేన అధికార ప‌త్రిక సామ్నాకు ఇచ్చిన ఇంట‌ర్యూలో సీఎం ఈమేర‌కు వ్యాఖ్యానించారు. తాను గ‌తంలో కూడా అయోధ్య‌కు వెళ్లాన‌ని, పూజ‌లు చేశాన‌ని, అప్ప‌డు కూడా నాకు గౌర‌వం ల‌భించింద‌ని చెప్పారు. ఇప్పుడు తాను ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉన్నాన‌ని, ప్రార్థ‌న‌లు చేయ‌డానికి అయోధ్య‌కు వెళ్తాన‌ని, భూమిపూజ వేడుక‌లో పాల్గొంటాన‌ని వెల్ల‌డించారు. 

అదేవిధంగా థాక్రే నేతృత్వంలోని మ‌హావికాస్ అఘాడి ప్ర‌భుత్వం ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్‌లో కూలిపోతుంద‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న పార్టీల‌కు ఆయ‌న స‌వాల్ విసిరారు. అప్ప‌టిదాకా ఎందుకు త‌క్ష‌ణ‌మే త‌న ప్ర‌భుత్వాన్ని కూల్చాల‌ని ప్ర‌క‌టించారు. త‌న ప్ర‌భుత్వ భ‌విష్య‌త్ ప్ర‌తిప‌క్షాల చేతిలో లేద‌ని బీజేపీపై మండిప‌డ్డారు.


logo