శుక్రవారం 03 జూలై 2020
National - Feb 05, 2020 , 15:31:22

ఢిల్లీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : నిర్భయ తల్లి

ఢిల్లీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : నిర్భయ తల్లి

న్యూఢిల్లీ : నిర్భయ దోషులు వారం రోజుల్లోగా తమ న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని నిర్భయ తల్లి ఆశా దేవీ తెలిపారు. వారం రోజుల తర్వాత వీలైనంత త్వరగా దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 

దోషుల ఉరిశిక్షపై స్టేను ఎత్తివేసి శిక్షించాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. డెత్‌ వారెంట్లపై స్టే విధించిన పటియాలా హౌస్‌ కోర్టు తీర్పును పక్కన పెట్టేందుకు కోర్టు నిరాకరించింది. శిక్ష అమలు జాప్యానికి చేసే ప్రయత్నాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుని.. వారం రోజుల్లోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత నిబంధనలకు అనుగుణంగా వెళ్లాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దోషులకు విడివిడిగా ఉరిశిక్ష అమలు చేయడం కుదరదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. 


logo