శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 22, 2021 , 15:14:01

మ‌నో వేద‌న‌తోనే రాజీనామా: ‌బెంగాల్ మంత్రి

మ‌నో వేద‌న‌తోనే రాజీనామా: ‌బెంగాల్ మంత్రి

కోల్‌క‌తా: మ‌నో వేద‌న‌తోనే తాను మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింద‌ని ప‌శ్చిమబెంగాల్ అట‌వీశాఖ మంత్రి రాజీవ్ బెన‌ర్జి తెలిపారు. మంత్రిగా నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఓ ద‌శ‌లో తీవ్ర‌ మ‌నోవేద‌న‌కు గుర‌య్యాను. చివ‌రికి ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. నా నిర్ణ‌యం న‌న్ను ఎంత‌గానో బాధించింది. నా హృద‌యాన్ని బ‌ద్ద‌లు చేసింది. అయినా రాజీనామా చేయాల్సి వ‌చ్చింది అని రాజీవ్ బెన‌ర్జి పేర్కొన్నారు. అదేవిధంగా త‌న‌కు మంత్రి ప‌దవి ఇచ్చి ఇన్నాళ్లు మార్గ‌ద‌ర్శ‌నం చేసిన మ‌మ‌తా బెన‌ర్జికి కృత‌జ్ఞ‌తలు తెలుపుకుంటున్నాన‌ని ఆయన చెప్పారు. అయితే, మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ప్ప‌టికీ బెంగాల్ ప్ర‌జ‌లకు సేవ చేయాల‌నే త‌న సంక‌ల్పానికి మాత్రం క‌ట్టుబ‌డే ఉంటాన‌ని రాజీవ్ బెన‌ర్జి స్ప‌ష్టంచేశారు.    ‌ 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo