శనివారం 30 మే 2020
National - May 13, 2020 , 09:06:17

55 రోజులు బంధువుల ఇంట్లో ఉన్నా: వ‌ంద‌న‌

55 రోజులు బంధువుల ఇంట్లో ఉన్నా: వ‌ంద‌న‌

న్యూఢిల్లీ: లాక్ డౌన్ తో దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని స్వస్థ‌లాల‌కు తీసుకువ‌చ్చేందుకు కేంద్రం ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతున్న విష‌యం తెలిసిందే. టికెట్లు బుక్ చేసుకుని స్వ‌స్థ‌లాల‌కు చేరుకుంటున్నారు.

అహ్మ‌దాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్న వంద‌న అనే ప్ర‌యాణికురాలు మాట్లాడుతూ..లాక్ డౌన్ తో నేను 55 రోజులుగా అహ్మ‌దాబాద్ లో చిక్కుకున్నా. అక్క‌డ మా బంధువుల ఇంట్లో ఉన్నాను. నేను ఇంటికెళ్లడానికి టిక్కెట్ కొనేందుకు 3 గంట‌ల‌కు ప్ర‌య‌త్నించాను. అదృష్ట‌వ‌శాత్తు టికెట్ దొరికింది. ఇంటికి వెళ్లేందుకు ప్ర‌త్యేకంగా రైళ్ల‌ను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ‌కు, ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొంది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo