బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 18:44:47

మోదీజీ చేతిలో నేను చెక్కిన రాముడిని చూసి మురిసిపోయాను..

మోదీజీ చేతిలో నేను చెక్కిన రాముడిని చూసి మురిసిపోయాను..

బెంగళూరు: తాను చెక్కిన శ్రీరాముడి విగ్రహం ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో చూసి ఎంతో మురిసిపోయినట్లు కళాకారుడు  మాధవచార్య రామమూర్తి తెలిపారు. ఆ సుందర రామమూర్తిని చెక్కడానికి ఎంతో శ్రమించినట్లు చెప్పారు. చెక్కతో దేవుడి చిత్రాలను రూపొందించడంలో తనకు 42 ఏండ్ల అనుభవం ఉన్నదని గురువారం ఆయన వివరించారు.


ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం కోసం బుధవారం ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమిపూజ, శంకుస్థాపన జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రధాని మోదీకి శ్రీరాముడి విగ్రహాన్ని బహూకరించారు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన కళాకారుడు మాధవచార్య రామమూర్తి ఎంతో ప్రత్యేకంగా ఈ సుందర రామమూర్తిని తయారు చేశారు. 

తాజావార్తలు


logo