శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 08, 2020 , 18:45:04

నేను పేడ‌లో పుట్టాను.. క‌రోనా నా ద‌గ్గ‌రికి కూడా రాదు : మ‌ంత్రి

నేను పేడ‌లో పుట్టాను.. క‌రోనా నా ద‌గ్గ‌రికి కూడా రాదు : మ‌ంత్రి

భోపాల్ ‌: క‌రోనాపై ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు వింత వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఎలాంటి శాస్ర్తియ ఆధారాలు లేకుండా వారు మాట్లాడే మాట‌లు వింటున్న జ‌నం న‌వ్వుకుంటున్నారు. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి ఇమార్తి దేవి గ్వాలియ‌ర్‌లో ఇలాంటి వ్యాఖ్యే ఒక‌టి చేశారు. తాను మ‌ట్టి, ఆవు పేడ‌లో జ‌న్మించాన‌ని.. త‌న‌కు క‌రోనా రాద‌ని ఆమె తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా.. నెటిజ‌న్లు త‌మాషా కామెంట్లు పెడుతున్నారు.

మీకు క‌రోనా సోకింద‌ట‌గా అని ఓ విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి ఇమార్తిదేవి స్పందిస్తూ “మీరు నాకు క‌రోనా వ‌చ్చిందంటున్నారు. నేను మ‌ట్టి, ఆవు పేడలో జన్మించాను. అక్కడ చాలా సూక్ష్మక్రిములున్నాయి. కరోనా నా దగ్గరికి కూడా రాదు.  ఈ మాస్కును కూడా నేను బ‌ల‌వంతంగా ధ‌రించాల్సి వ‌చ్చింద‌”ని తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo