గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 18, 2020 , 15:40:36

రాజీనామా చేసిన హర్‌సిమ్రత్‌ కౌర్‌కు అభినందనలు..

రాజీనామా చేసిన హర్‌సిమ్రత్‌ కౌర్‌కు అభినందనలు..

న్యూఢిల్లీ: రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం నుండి రాజీనామా చేసిన హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ను అభినందిస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధ్యక్షుడు దుష్యంత్ కూడా రైతు వ్యతిరేక బిల్లులపై బీజేపీకి మద్దతు ఇవ్వకూడదని ఆయన అన్నారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ఆయన ఓటమిని చూడాల్సివస్తుందని హెచ్చరించారు. అందుకే బీజేపీకి బదులుగా రైతులకు మద్దతు ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అనుకూలంగా ఏపీఎంసీ చట్టాన్ని చేసిందని ఆయన తెలిపారు. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక బిల్లుల వల్ల ఏ పెద్ద వ్యాపారి అయినా ఒక మండిని తెరువవచ్చని చెప్పారు. మండిపై ఏదైనా వివాదం వస్తే అధికారుల జోక్యం ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న నాలుగు ఆర్డినెన్స్‌లను అన్ని పార్టీలు వ్యతిరేకించాలని దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo