బుధవారం 20 జనవరి 2021
National - Dec 18, 2020 , 17:40:36

రాహుల్ గాంధీయే పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాలి: సుర్జేవాలా

రాహుల్ గాంధీయే పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాలి: సుర్జేవాలా

న్యూఢిల్లీ: ‌కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్య‌క్షుడిని ఎన్నుకునే ప్రక్రియ త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి ర‌ణ్‌దీప్ సుర్జేవాలా వెల్ల‌డించారు. కాంగ్రెస్ పార్టీ ఎల‌క్టోర‌ల్ కాలేజీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ క‌మిటీ స‌భ్యులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు, స‌భ్యులు అంద‌రూ క‌లిసి త‌దుప‌రి అధ్య‌క్షుడిని ఎన్నుకుంటార‌ని ఆయ‌న చెప్పారు. అయితే, త‌న‌తో స‌హా పార్టీలోని 99.9 శాతం మంది రాహుల్‌గాంధీ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని కోరుకుంటున్న‌ట్లు సుర్జేవాలా తెలిపారు. కాగా, గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ వైఫ‌ల్యానికి నైతిక బాధ్య‌త వ‌హిస్తూ రాహుల్‌గాంధీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. అప్ప‌టి నుంచి సోనియాగాంధీ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలిగా కొన‌సాగుతున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo