బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 16:47:48

ముంబై పోలీసుల దర్యాప్తుపై నమ్మకం ఉంది: శరద్ పవార్

ముంబై పోలీసుల దర్యాప్తుపై నమ్మకం ఉంది: శరద్ పవార్

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసుపై దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులపై తనకు నమ్మకం ఉన్నదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల మధ్య వివాదం రేపిన ఈ కేసు గురించి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను గత 50 ఏండ్లుగా మహారాష్ట్ర, ముంబై పోలీసుల పనితీరును చూశానని, వారిని నమ్ముతున్నానని ఆయన చెప్పారు.

ముంబై పోలీసులపై ఆరోపణలు చేస్తున్న వారి గురించి వ్యాఖ్యానించబోనని శరద్ పవార్ అన్నారు. సుశాంత్ కేసును సీబీఐ లేదా మరో సంస్థ దర్యాప్తు చేయాలని ఎవరైనా భావిస్తే దానిని తాను వ్యతిరేకించనని ఆయన తెలిపారు. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు బీహార్ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో శరద్ పవార్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివనేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

తాజావార్తలు


logo