శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 29, 2020 , 15:49:10

నాకూ నిరాశ‌గానే ఉంది: క‌మ‌ల్‌హాస‌న్‌

నాకూ నిరాశ‌గానే ఉంది: క‌మ‌ల్‌హాస‌న్‌

చెన్నై: పార్టీ పెట్ట‌కూడ‌ద‌న్న ర‌జ‌నీకాంత్ నిర్ణ‌యం ఆయ‌న అభిమానుల‌లాగే త‌న‌నూ తీవ్ర నిరాశ‌కు గురి చేసింద‌ని అన్నారు మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్ అధినేత క‌మ‌ల్ హాస‌న్‌. అయితే ఆయ‌న ఆరోగ్య‌మే త‌న‌కు ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. త‌న ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన త‌ర్వాత ర‌జ‌నీకాంత్‌ను క‌లుస్తాన‌ని క‌మ‌ల్ చెప్పారు. ర‌జ‌నీ పార్టీ పెడుతున్నార‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. ఆయ‌న పార్టీతో పొత్తుపై గ‌తంలో క‌మ‌ల్ స్పందించారు. కేవ‌లం ఒక ఫోన్ కాల్ చేస్తే స‌రిపోతుంద‌ని, త‌మ ఇద్ద‌రి సిద్ధాంతాలు ఒక‌టే అయితే అహాల‌ను ప‌క్క‌న పెట్టి క‌లిసి ప‌ని చేయ‌డానికి తాను సిద్ధంగా ఉన్న‌ట్లు క‌మ‌ల్ అప్ప‌ట్లో స్ప‌ష్టం చేశారు. 


logo