ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 18:39:23

శతాధిక ట్యాక్స్‌ పేయర్‌లను సన్మానించిన ఐటీ

శతాధిక ట్యాక్స్‌ పేయర్‌లను సన్మానించిన ఐటీ

భోపాల్‌ : ఆదాయపు శాఖ సోమవారం శతాబ్దపు పన్ను చెల్లింపుదారులను సన్మానించింది. వీరిలో మధ్యప్రదేశ్‌కు చెందిన 117 సంత్సరాలు గల పురాతన వృద్ధురాలు బీనా కూడా ఉందని ఐటీ అధికారులు తెలిపారు. ఐటీ తన 160వ రోజున ఈ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టింది. 1903లో జన్మించిన గిరిజా బాయి తివారి అనే వృద్ధురాలు తన మొత్తం ఆదాయాన్ని ఇన్‌కాం టాక్స్‌కు చూపిస్తుంది. ఈమె ఇతరులకు ఆదర్శంగా నిలిచిందని ఇన్‌కం ట్యాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌ ఏకే చౌహాన్‌ అన్నారు. సోమవారం సన్మానం పొందిన వారిలో ఇండోర్‌కు చెందిన ఈశ్వరిబాయి లుల్లా (103), బిలాస్‌పూర్‌కు చెందిన బీనా రక్షీత్ (100), ఇండోర్‌కు చెందిన కాంచన్ బాయి (100) కూడా ఉన్నారని ఐటీ అధికారులు తెలియజేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo