ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 20:28:23

అసంతృప్త ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హాజరు కావాలి: అశోక్ గెహ్లాట్‌

అసంతృప్త ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హాజరు కావాలి: అశోక్ గెహ్లాట్‌

జైపూర్‌: అసంతృప్త ఎమ్మెల్యేలంద‌రూ అసెంబ్లీ సమావేశాల‌కు హాజరు కావాలని రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచినందున ప్ర‌జ‌ల ప‌క్షాన‌,  ప్ర‌భుత్వంతో క‌లిసి ఉండాల్సిన బాధ్య‌త ఆ ఎమ్మెల్యేల‌కు ఉంద‌న్నారు. అసెంబ్లీ సమావేశానికి పిలుపునివ్వాలన్న త‌న అభ్యర్థనను గవర్నర్ చివరకు అంగీకరించినందుకు సంతోషంగా ఉన్న‌ద‌ని గెహ్లాట్ చెప్పారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మాదిరిగా రాజ‌స్థాన్‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ  కుట్ర ప‌న్నుతున్న‌ద‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌కు డ‌బ్బులు, ప‌ద‌వుల‌ను ఎర‌వేసి కొనుగోలుకు ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి అంద‌రికీ తెలుస‌ని విమ‌ర్శించారు. అయిన‌ప్ప‌టికీ అదేమీ త‌మ ప్ర‌భుత్వాన్ని ప్ర‌భావితం చేయ‌లేద‌ని, ఐదేళ్ల పాల‌న‌ను పూర్తి చేస్తామ‌ని సీఎం అశోక్ గెహ్లాట్ ధీమా వ్య‌క్తం చేశారు.logo