సోమవారం 13 జూలై 2020
National - Jun 05, 2020 , 17:43:01

మోదీ త‌ప్పుకోవాల‌ని నేనెప్పుడూ అనలేదుగా: మ‌మ‌తాబెన‌ర్జి

మోదీ త‌ప్పుకోవాల‌ని నేనెప్పుడూ అనలేదుగా: మ‌మ‌తాబెన‌ర్జి

కోల్‌క‌తా: భారతీయ జ‌న‌తాపార్టీ స్థానిక నాయ‌క‌త్వంపై ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నేరుగా ఆ పార్టీ పేరును ప్ర‌స్తావించ‌కుండా ఆమె తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.  తాము క‌రోనా వైర‌స్‌కు‌, అంఫాన్ తుఫానుకు ఎద‌రొడ్డి పోరాటం చేస్తున్న స‌మ‌యంలో కొన్ని రాజ‌కీయ పార్టీలు త‌న‌ను ప‌ద‌వి నుంచి దిగిపోవాల‌ని డిమాండ్ చేశాయ‌ని, ఇది చాలా బాధాక‌ర‌మైన విష‌మ‌య‌ని మ‌మ‌తా బెన‌ర్జి పేర్కొన్నారు.

'మేం ఒక వైపు క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతున్నాం. మ‌రోవైపు అంఫాన్ తుఫాను సృష్టించిన బీభ‌త్సం నుంచి తేరుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. ప్ర‌జ‌ల ప్రాణ ర‌క్ష‌ణ కోసం మేం ప‌ని చేస్తుంటే, కొన్ని పార్టీలు త‌న‌ను ప‌ద‌వి నుంచి వైదొల‌గాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. ఇది చాలా బాధాక‌రం అని మ‌మ‌తాబెన‌ర్జి వ్యాఖ్యానించారు. రాజ‌కీయాలు చేయ‌డానికి ఇదా స‌మ‌యం?' అని ఆమె మండిప‌డ్డారు. 

ఇప్పుడు త‌న‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని డిమాండ్ చేస్తున్న పార్టీలు గ‌త మూడు నెల‌ల నుంచి ఎక్క‌డ దాక్కున్నాయ‌ని మ‌మ‌తాబెన‌ర్జి ఎద్దేవా చేశారు. కేంద్రం ప‌నితీరు ఎలా ఉన్నా ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని తాను ఎప్పుడూ డిమాండ్ చేయ‌లేదంటూ స్థానిక బీజేపీ నేత‌ల‌కు చుర‌క‌లు వేశారు. 'మేం ప్ర‌జ‌ల‌కు క్షేత్ర‌స్థాయిలో సేవ‌లు చేస్తున్నాం. ఇలాంటి కుట్ర రాజ‌కీయాలు మ‌మ్మ‌ల్ని ఏమీ చేయ‌లేవు. బెంగాల్ క‌రోనా వైర‌స్‌పైనే కాదు, ఇలాంటి రాజ‌కీయ కుట్ర‌ల‌పై గెలుస్తుంది' అని ఆమె ధీమా వ్య‌క్తం చేశారు.  


 


logo