National
- Jan 04, 2021 , 19:07:25
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తదుపరి సమావేశంలో అర్థవంతమైన చర్చలు: తోమర్

న్యూఢిల్లీ: రైతు నేతలతో శుక్రవారం జరిగే తదుపరి సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరుగవచ్చని ఆశిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. 41 రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్వహించిన ఏడో విడత చర్చలు కూడా అర్ధాంతరంగా ముగిశాయి. అనంతరం కేంద్ర మంత్రి తోమర్ మీడియాతో మాట్లాడారు. మూడు వ్యవసాయ చట్టాలపై నిబంధనల వారీగా చర్చలు జరుపుదామని రైతు నేతలకు ప్రతిపాదించామన్నారు. అయితే చట్టాలను రద్దు చేయడంపైనే రైతు సంఘాలు పట్టుబట్టాయని చెప్పారు. దీంతో రైతు నేతలతో ఏడోసారి జరిగిన చర్చల్లో కూడా ఎలాంటి పరిష్కారానికి చేరుకోలేకపోయినట్లు తోమర్ వెల్లడించారు. ఇవాళ్టి చర్చల తీరును పరిశీలించిన అనంతరం ఈ నెల 8న జరిగే ఎనిమిదో విడత సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరిగి ఒక ముగింపు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
- మెక్సికో ప్రెసిడెంట్కు కరోనా పాజిటివ్
- దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు
- నెత్తిన ముళ్ల కిరీటం, చేతులకు శిలువ.. జగపతి బాబు లుక్ వైరల్
- 1.28 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం
- తెలంగాణ ఎంసెట్ సిలబస్ తగ్గింపు?
- నల్లగొండలో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య
- ఎస్సెస్సీ పోటీ పరీక్షల కోసం టీశాట్ ప్రసారాలు
- బక్కచిక్కిన ముద్దుగుమ్మ.. నమ్మలేకపోతున్న ఫ్యాన్స్
- వాహ్.. వాగులో వాలీబాల్..!
- ఆంబోతుల ఫైట్.. పంతం నీదా..? నాదా..?
MOST READ
TRENDING