శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 21, 2020 , 21:03:29

టీఎంసీ వైరస్‌కు నా దగ్గర వ్యాక్సిన్‌ ఉంది: దిలీప్ ఘోష్

టీఎంసీ వైరస్‌కు నా దగ్గర వ్యాక్సిన్‌ ఉంది: దిలీప్ ఘోష్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) వైరస్‌కు తన దగ్గర వ్యాక్సిన్‌ ఉన్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. కరోనా మాదిరిగానే, టీఎంసీ కూడా తనను ఏమీ చేయలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.దుర్గాపూర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కొత్త కార్యాలయాన్ని పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఎంసీని కరోనా వైరస్‌తో పోల్చారు. ‘కరోనాకు టీకా మన దగ్గర ఉంది. అది ఎప్పుడు మనకు అందుతుందో తెలియదు. అయితే వచ్చే ఏడాది మేలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ నుంచి టీఎంసీ వెళ్లిపోతుందని నాకు తెలుసు. ఎందుకంటే నా దగ్గర టీఎంసీ వైరస్ వ్యాక్సిన్ ఉంది’ అని దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన కోలుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.