మంగళవారం 26 మే 2020
National - May 21, 2020 , 16:21:31

జీవితంలో ఇలాంటి విలయం ఎప్పుడూ చూడలేదు: దీదీ

జీవితంలో ఇలాంటి విలయం ఎప్పుడూ చూడలేదు: దీదీ

కోల్‌కతా: తన జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి ప్రకృతి ప్రకోపాన్ని చూడలేదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. అంఫాన్‌ తుఫాన్‌ వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 72 మంది మరణించారని ఆమె వెల్లడించారు. తుఫాన్‌ సృష్టించిన విలయాన్ని పరిశీలించడానికి రాష్ట్రంలో పర్యటించాలని ప్రధాని మోదీని తానే స్వయంగా కోరుతానని చెప్పారు. చాలా మంది క్షతగాత్రులయ్యారని, తుఫాను వల్ల మరణించినవారి కుటుంబాలకు రూ.2.5 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని ఆమె ప్రకటించారు. 

అంఫాన్‌ తుఫాన్‌ పశ్చిబెంగాల్‌లో బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులు, వర్షాల వల్ల వేలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి. బెంగాల్‌ తీరం వెంబడి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతోపాటు కుండపోత వర్షం కురియడంతో కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయం జలదిగ్భందమయ్యింది. రన్‌వే, హాంగర్లు పూర్తిగా నీటమునడగంతోపాటు, బలమైన ఈదురు గాలుతో విమానాశ్రయంలోని కొన్ని నిర్మాణాలు విరిగిపడ్డాయి. దీంతో విమనాలు ధ్వంసమయ్యాయి. 


logo