ఆదివారం 31 మే 2020
National - May 09, 2020 , 16:54:57

ఇంత త్వ‌ర‌గా ఇండియాకు తీసుకొస్తార‌నుకోలేదు..

ఇంత త్వ‌ర‌గా ఇండియాకు తీసుకొస్తార‌నుకోలేదు..

లండ‌న్ : వ‌ందేభార‌త్ మిష‌న్ లో భాగంగా లాక్ డౌన్ తో విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల‌ను కేంద్ర‌ప్ర‌భుత్వం ఇండియాకు తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. లండ‌న్ లో నిలిచిపోయిన భారతీయుల బృందం ఎయిరిండియా ప్ర‌త్యేక విమానంలో ఇవాళ ముంబైకి చేరుకోనుంది.

ఈ నేప‌థ్యంలో భార‌త్ కు చెందిన ఓ ప్ర‌యాణికుడు మాట్లాడుతూ..ఇక్క‌డ ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంద‌ని నేను భార‌త హైక‌మిష‌న్ కు లేఖ రాశాను. భారత హైక‌మిష‌న్ అధికారులు వెంట‌నే స్పందించారు. లండ‌న్ లో ఉన్న‌వారిని మ‌న‌దేశానికి ఇంత త్వ‌ర‌గా తీసుకొస్తారని నేను అస్స‌లు ఊహించ‌లేదు. భార‌త ప్ర‌భుత్వానికి, అధికారుల‌ను నా ధ‌న్య‌వాదాలు తెలిజేస్తున్న‌ట్లు చెప్పాడు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo