శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 07, 2020 , 14:58:31

నేను యోగిని.. మ‌సీదుకు వెళ్ల‌ను

నేను యోగిని.. మ‌సీదుకు వెళ్ల‌ను

హైద‌రాబాద్‌:  అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం భూమిపూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ వేడుక‌లో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ పాల్గొన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్ర‌కారం వివాదాస్ప‌ద స్థలంలో మ‌సీదును కూడా నిర్మించాల్సి ఉన్న‌ది.  ఒక‌వేళ ఆ మ‌సీదు ప్రారంభోత్స‌వానికి ఆహ్వానం వ‌స్తే, ఆ కార్య‌క్ర‌మానికి ఓ హిందువుగా తాను వెళ్లద‌లుచుకోలేద‌ని సీఎం యోగి తెలిపారు.  ఓ మీడియా ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న బదులిస్తూ.. ఒక సీఎంగా త‌న‌కు మ‌తాల‌తో ఎటువంటి స‌మ‌స్య లేద‌ని,  త‌ల‌కు టోపీ పెట్టుకుని రోజా, ఇఫ్తార్‌ల‌కు వెళ్లేవారు సెక్యుల‌ర్ అన్న‌ట్లుగా చెప్పుకుంటున్నారని సీఎం యోగి ఆరోపించారు. నేను యోగిని.. అందుకే మ‌సీదు ప్రారంభోత్స‌వానికి వెళ్ల‌ను, ఒక హిందువుగా త‌న‌కు న‌చ్చిన‌ట్లు ప్రార్థ‌న‌లు చేస్తాన‌న్నారు. మ‌సీదు నిర్మాణంలో తాను భాగ‌స్వామి కాదు అని, అందుకే త‌న‌ను ఎవ‌రూ పిలువ‌ర‌ని, అక్క‌డికి వెళ్లాల‌ని లేదని, అయినా త‌న‌కు ఆహ్వానం వ‌స్తుంద‌నుకోవ‌డం లేద‌ని సీఎం యోగి తెలిపారు.  


logo