బుధవారం 21 అక్టోబర్ 2020
National - Aug 24, 2020 , 01:29:47

వద్దన్నా.. వినలేదు

వద్దన్నా.. వినలేదు

  • ఢిల్లీలో  పట్టుబడిన ఉగ్రవాది అబూ యూసుఫ్‌ భార్య అయేషా ఆవేదన
  • 15 కిలోల ఐఈడీతో అబూ అరెస్టు.. విచారణలో తేలిన ఐసిస్‌ సంబంధాలు

సోదాల్లో 30 కిలోల ఐఈడీలు, రెండు ఆత్మాహుతి సూట్లు స్వాధీనంన్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాల వైపు వెళ్ల వద్దని ఎంత చెప్పినా తన భర్త వినలేదని ఢిల్లీలో పట్టుబడ్డ ఐసిస్‌ ఉగ్రవాది అబూ యూసుఫ్‌ భార్య చెప్పారు. ఇంట్లో పేలుడు పదార్థాలు పెట్టవద్దని తాను ఎన్నో సారు బతిమాలానని చెప్పారు. తనకు నలుగురు పిల్లలని ఇప్పుడు ఎలా బతకాలని ప్రశ్నించారు. దయచేసి తన భర్తను క్షమించాలని వేడుకున్నారు. అబూ యూసుఫ్‌ తండ్రి కఫీల్‌ అహ్మ ద్‌ తన కుమారుడి అరెస్టు పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూసుఫ్‌ చాలా సౌమ్యుడని, ఎవరితో ఎప్పుడూ గొడవ పడలేదని చెప్పారు. అతడు ఉగ్రవాదంవైపు ఆకర్షితుడవుతాడని కలలోకూడా ఊహించలేదన్నాడు. 

ఉగ్ర కుట్ర భగ్నం

దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు చేధించారు.ఐసిస్‌ ఉగ్రవాది మహ్మద్‌ ముస్తాకీమ్‌ అలియాస్‌ అబూ యూసుఫ్‌ను శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అతనివద్దనుంచి 15 కిలోల రెండు ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ‘అవి పూర్తిగా యాక్టివ్‌గా ఉన్నాయి. కేవలం టైమర్‌ సెట్‌చేస్తే పేలిపోతాయి’ అని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని యూసుఫ్‌ ఇంటిలో 15 కిలోలకు పైగా ఐఈడీలను, బాంబులతో నింపిన రెండు ఆత్మాహుతి సూట్లను కూడా గుర్తించారు. అబూ యూసుఫ్‌కు ఐసిస్‌తో సంబంధాలున్నట్టు విచారణలో తేలింది. అతడు అప్ఘనిస్థాన్‌లోని ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది యూసుఫ్‌-అల్‌-హిందీ అలియాస్‌ సఫీ అర్మార్‌తో టచ్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. సఫీ అర్మార్‌ పాకిస్థాన్‌ సహాయంతో అఫ్ఘనిస్థాన్‌ నుంచి ఇండియాలో ఐసిస్‌ మాడ్యూల్‌ను నడిపిస్తున్నాడు. అతడిపై రీసెర్చి అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా) చాలా కాలంగా నిఘా పెట్టింది. 

ఆగస్టు 15నే పేలుళ్లకు  కుట్ర

స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఢిల్లీలో పేలుళ్లకు అబూ యూసుఫ్‌ కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు. అందుకోసమే అతడు యూపీలోని బధియా భాయ్‌సాహి గ్రామం నుంచి ఢిల్లీకి వచ్చాడని చెప్పారు. 

ఇంట్లో సూసైడ్‌ జాకెట్లు

పోలీసులు యూపీలోని అబూ యూసుఫ్‌ ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో రెండు సూసైడ్‌ జాకెట్లు కూడా ఉన్నాయి. ఇంట్లో అధికారులు 15 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.


logo