బుధవారం 03 జూన్ 2020
National - Apr 10, 2020 , 16:45:34

ప్ర‌జాస్వామ్య స్ఫూర్తి క‌నిపిస్తోంది: జార్ఖండ్ సీఎం

ప్ర‌జాస్వామ్య స్ఫూర్తి క‌నిపిస్తోంది: జార్ఖండ్ సీఎం

రాంచి: క‌రోనాపై పోరాటం ద్వారా దేశంలో ప్ర‌జాస్వామ్య స్ఫూర్తి క‌నిపిస్తోంద‌ని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. ప్రాణాంత‌క మ‌హ‌మ్మారిపై కలసికట్టుగా మనం చేస్తున్న పోరాటం ప్రజాస్వామ్యం ఎంత బలమైందో చాటిచెబుతోందని ఆయ‌న వ్యాఖ్యానించారు. క‌రోనా ర‌క్క‌సిని దేశం నుంచి పారదోలేందుకు అన్ని రాష్ట్రాలు ఒక్కటై కలసికట్టుగా పనిచేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌లు ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకున్నార‌ని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా సీఎంలు అంద‌రం కృషి చేస్తున్నామ‌ని హేమంత్ సోరెన్ చెప్పారు. 

ఈ క‌లిసిక‌ట్టు పోరాటం మన జాతి ఐకమత్యాన్ని చాటిచెబుతోందని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. లాక్‌డౌన్ విధించేటప్పుడు ప్రధాని రాష్ట్రాలను సంప్ర‌దించ‌క పోయినా, ఇప్పుడు లాక్‌డౌన్ తొలగించాలా వద్దా? అనే అనే విష‌యంలో అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరుతున్నార‌ని, ప్రజాస్వామ్యం అంటే ఇదేనని సోరెన్ పేర్కొన్నారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo