సోమవారం 01 జూన్ 2020
National - May 21, 2020 , 19:58:53

నిజమైన దేశభక్తుడి కొడుకుగా గర్విస్తున్నా: రాహుల్‌గాంధీ

నిజమైన దేశభక్తుడి కొడుకుగా గర్విస్తున్నా: రాహుల్‌గాంధీ

దిల్లీ: నిజమైన దేశభక్తుడికి కొడుకుగా జన్మించినందుకు గర్విస్తున్నానని కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. తన తండ్రి, భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్థంతి నేపథ్యంలో రాహుల్‌గాంధీ ఈ విధంగా ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని హోదాలో దేశానికి తన తండ్రి చేసిన సేవలను రాహుల్‌ ప్రస్తావించారు. రాజీవ్‌గాంధీ 29 ఏండ్ల క్రితం అంటే 1991, మే 21న ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులో పర్యటిస్తూ శ్రీ పెరంబుదూరు వద్ద రాజీవ్ హత్యకు గురయ్యారు.

'నిజమైన దేశభక్తుడు, ఉదారవాది, దయాహృదయం కలిగిన తండ్రికి తనయుడిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా. ప్రధానిగా రాజీవ్‌జీ భారత్‌ను అభివృద్ధి మార్గంలో పయనించేలా చేశారు. తన దూరదృష్టితో అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని దేశ సాధికారతకు కృషి చేశారు. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రేమ, కృతజ్ఞతాభావంతో సెల్యూట్‌ చేస్తున్నా' అని ట్విటర్ వేదికగా రాహుల్‌ గాంధీ తన తండ్రి ఫొటోను షేర్ చేశారు. 


logo