శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 19:55:44

ఇంటర్‌లో చేరి కష్టపడి చదువుతానంటున్న మంత్రి

ఇంటర్‌లో చేరి కష్టపడి చదువుతానంటున్న మంత్రి

రాంచీ: తాను ఇంటర్‌లో చేరుతున్నానని, కష్టపడి చదువుతానని జార్ఖండ్ హెచ్ఆర్డీ మంత్రి జగ‌ర్నాథ్ మహతో తెలిపారు. పదో తరగతి వరకే చదివిన తాను హెచ్ఆర్డీ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో తన సామర్థ్యాన్ని ప్రశ్నించినప్పుడు చాలా బాధ కలుగుతున్నదని ఆయన చెప్పారు. అందుకే 11వ తరగతిలో చేరుతున్నానని మహతో అన్నారు. జార్ఖండ్‌ వ్యాప్తంగా 4,416 మోడల్ స్కూళ్లను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. వీటి ఏర్పాటుతో విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు మరిన్ని సౌకర్యాలు ఒనగూరుతాయని అన్నారు. దీనికి సంబంధించిన ఫైల్‌పై సోమవారం సంతకం చేసినట్లు ఆయన చెప్పారు.


logo