శనివారం 16 జనవరి 2021
National - Jan 08, 2021 , 19:29:57

బీజేపీ నేతల కంటే నేనే సిసలైన హిందువును : దిగ్విజయ్‌ సింగ్‌

బీజేపీ నేతల కంటే నేనే సిసలైన హిందువును : దిగ్విజయ్‌ సింగ్‌

న్యూఢిల్లీ : బీజేపీ నాయకుల కంటే తానే సిసలైన హిందువునని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్ అన్నారు. రామ మందిర్‌ ట్రస్ట్‌ హిందు, ముస్లింలను విభజిస్తున్నదని ఆయన మండిపడ్డారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వివరాలు సేకరించేందుకు మధ్యప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో బీజేపీ మితవాద సంస్థలైన విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ), భజ్‌రంగ్‌ దళ్‌లు ర్యాలీలు నిర్వహించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ర్యాలీల పేరుతో మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని ఆక్షేపించారు. 

ఉజ్జయినిలోని భేగమ్‌ భాగ్‌ ప్రాంతంలో నిర్వహించిన ఓ ర్యాలీలో కొందరు ర్యాలీపై రాళ్లు విసరడంతో పరిస్థితి అదుపుతప్పింది. మహిళలతో సహా చాలామంది ర్యాలీ నిర్వహిస్తున్న వ్యక్తులపై ఇటుకలు రువ్వడం సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించింది. అక్రమంగా నిర్మిస్తున్న ఓ ఇంటి నుంచి వీరు ర్యాలీపైకి రాళ్లు రువ్వినట్లు ఉజ్జయిని పోలీసులు గుర్తించారు. ఇండోర్‌లో నిధుల సేకరణకు నిర్వహించిన ఓ కార్యక్రమం మత ఉద్రిక్తలకు దారి తీసింది. మసీదు బయట హనుమాన్‌ చాలిసా చదువుతూ కనిపించిన కొందరు మసీదును ధ్వంసం చేసేందుకు యత్నించారు. రాళ్లు రువ్విన ఘటనలపై ఆ రాష్ట్ర సీఎం తీవ్రంగా స్పందించారు. ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు గుర్తిస్తే జీవతఖైదు విధించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.   


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.