శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 20:06:09

మందిరం కోసం ప్రాణాలు ఫ‌ణంగా పెట్టా: ఉమాభార‌తి

మందిరం కోసం ప్రాణాలు ఫ‌ణంగా పెట్టా: ఉమాభార‌తి

భోపాల్‌: రామ మందిరం కోసం ప్రాణాలు ఫ‌ణంగా పెట్టానని, ఆగస్టు 5న జరిగే భూమిపూజకు ట్రస్టు నుంచి ఆహ్వానం అందితే మాత్రం కచ్చితంగా వెళ్తానని బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి ప్రకటించారు. రామ మందిర ఉద్యమం 500 ఏండ్లుగా కొనసాగుతున్న‌ద‌ని, ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంద‌రూ దీన్ని చూశారని ఆమె తెలిపారు. కరోనా కాలంలో భూమిపూజ జరుగుతున్న‌ది కాబట్టి ప్రోటోకాల్‌ను తప్పకుండా పాటించాలని, ఇప్పటివరకైతే ట్రస్టు నుంచి తనకు పిలుపు అందలేదని ఆమె వెల్లడించారు.

రామమందిర ఉద్యమంలో పాల్గొన్నందుకు ఎప్పుడూ విచారం వ్యక్తంచేయని నేతల్లో తాను కూడా ఉన్నానని  ఉమాభార‌తి తెలిపారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసు గురించి ప్రస్తావిస్తూ ఆ కేసులో తాను నిందితురాలిన‌ని, ఇటీవలే సీబీఐ కోర్టులో హాజరయ్యానని ఆమె చెప్పారు. రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొనడం గర్వకారణమని పేర్కొన్నారు. ఆగస్టు 5న జరిగే భూమిపూజకు ప్రధాని మోదీ హాజరైతే తప్పేంటని, ఇది కరోనాపై ప్రకటించిన యుద్ధాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం కావడంలేదని మండిపడ్డారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo