గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 22:52:57

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు

హ్యుందాయ్  క్రెటా సరికొత్త రికార్డు

ఢిల్లీ: దేశంలోని మొట్టమొదటి స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్, అతిపెద్ద ఎగుమతిదారు అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) ఇటీవల విడుదల చేసిన ఆల్ న్యూ క్రెటా - అల్టిమేట్ ఎస్‌యూవీకి  అనూహ్య స్పందన వస్తున్నది. రికార్డు స్థాయిలో 55,000 బుకింగ్స్ తో అరుదైన ఘనత సాధించింది. ఈ విజయంపై హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, “2015 లో ప్రారంభించినప్పటి నుంచి క్రెటా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ లో ఒక బెంచ్ మార్క్ నమోదు చేసిందని ఆయన అన్నారు. మార్చి 2020 లో ఆల్ న్యూ క్రెటా ప్రారంభించడంతో, హ్యుందాయ్ ఈ విభాగంలో మరోసారి ఎస్‌యూవీ నాయకత్వాన్ని పునర్నిర్వచించిందని . కేవలం 4 నెలల్లో 55,000 బుకింగ్‌లు ఎక్కువ కస్టమర్ల తో రికార్డ్ సృష్టించిందని తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. మే, జూన్ 2020 లో అత్యధిక అమ్మకాలను సాధించడం ద్వారా న్యూ క్రెటా ఎస్‌యువి విభాగంలో తన నాయకత్వాన్ని నిరూపించుకున్నది.  logo