శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 15:23:06

హైడ్రాక్సీ క్లోరోక్విన్ పై ప్రభుత్వం కఠిన నిబంధనలు !

హైడ్రాక్సీ క్లోరోక్విన్ పై  ప్రభుత్వం కఠిన నిబంధనలు !

మలేరియా నివారణలో ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ప్రజలు విచక్షణ రహితంగా వాడుతున్నారు. దీంతో కేంద్రం దీని వాడకంపై కఠిన నిబంధనలను ప్రకటంచింది. ఈ మందును హెచ్ 1 మందుల జాబితాలో చేర్చింది. కరోనా వైరస్ నిరోధించడంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ ఇటీవల ప్రకటించింది. కరోనా రాకుండా ఉండాలంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడాలన్న తప్పుడు అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లింది. దీంతో అవసరమున్నవారు లేని వారు విపరీతంగా దీన్ని వాడుతున్నారు. వాస్తవానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనవసరంగా వాడితే చెడు ఫలితాలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క‌రోనా ఉన్న‌వారు దీన్ని వాడితే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని వైద్యులు పేర్కొంటున్నారు. ఎవ‌రు ప‌డితే వారు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడుతుండ‌టాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించి హెచ్ 1 ఔషధాల జాబితాలో చేర్చింది. ఇప్పటి నుంచి దీన్ని రిజిస్టర్ డాక్టర్లు ప్రిస్కిప్షన్ ఉంటేనే వాడాలి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందుల స్క్రిప్ట్ ఎరుపు క‌ల‌ర్‌లో ఆర్ఎక్స్ అనే గుర్తు ఉంటుంది. డాక్టర్ల సలహా లేకుండా దీన్ని వాడితే ప్రమాదం అని రాసి ఉంటుంది. ఈ మందుల కొరత రాకుండా కేంద్రం హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతిని నిషేధించింది. ప్ర‌జ‌లు అన‌వ‌స‌రంగా సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వార్త‌లు, వీడియోలు చూసి మందులు వాడ‌వ‌ద్ద‌ని డాక్ట‌ర్లు హెచ్చ‌రిస్తున్నారు. క‌రోనా గురించి ఎటువంటి సందేహం ఉన్న స‌మీపంలోని వైద్యుల‌ను, హెల్ప్ లైన్ నంబ‌ర్ల‌లో సంప్ర‌దించాల‌ని వైద్యులు పేర్కొంటున్నారు.


logo