శనివారం 30 మే 2020
National - Apr 01, 2020 , 01:30:49

కరోనాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌

కరోనాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌

-సిఫార్సు చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: కరోనాతో ఆరోగ్యం విషమించినవారికి యాంటీ మలేరియా ఔషధం ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌'ను ‘ఎజిత్రోమైసిన్‌'తో కలిపి వాడొచ్చని కేంద్ర వైద్య శాఖ సిఫార్సు చేసింది. అయితే ఈ మందును 12 ఏండ్లలోపు పిల్లలకు, గర్భిణులకు సిఫార్సు చేయడం లేదని తెలిపింది. ఈ మేరకు కరోనా ‘క్లినికల్‌ నిర్వహణ’పై మంగళవారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రత్యేకించి ఏ యాంటీవైరల్‌ మందు కూడా కరోనాపై ప్రభావవంతంగా పనిచేస్తున్న నిర్ధారణ కాలేదని, అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని అనుసరించి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సిఫార్సు చేస్తున్నట్లు తెలిపింది. ఇంతకుముందు సిఫార్సు చేసిన యాంటీ హెచ్‌ఐవీ మందులను (లొపినవీర్‌, రిటోనవీర్‌) కేంద్రం ఉపసంహరించుకున్నది. వీటి వల్ల రోగులకు పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదని అందుకే ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది.


logo