సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 22:59:31

భార్య‌కు క‌రోనా.. ఇంటికి తీసుకెళ్లిన భ‌ర్త!‌

భార్య‌కు క‌రోనా.. ఇంటికి తీసుకెళ్లిన భ‌ర్త!‌

బెంగ‌ళూరు: కరోనా మ‌హ‌మ్మారికి ప్ర‌పంచ దేశాలు గ‌డ‌గ‌డ వ‌ణికిపోతుంటే క‌ర్ణాట‌క రాష్ట్రం మంగ‌ళూరుకు చెందిన ఓ వ్య‌క్తి మాత్రం ఆ వైర‌స్‌ను లైట్ తీసుకున్నాడు. గ‌ర్బిణి అయిన త‌న భార్య‌కు ఇటీవ‌ల క‌రోనా పాజిటివ్ రావ‌డంతో అధికారులు ఆమెను ఆస్ప‌త్రిలో చేర్పించారు. అనంత‌రం ఆస్ప‌త్రిలో ఆమె ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో ఆస్ప‌త్రికి వెళ్లిన భ‌ర్త త‌న భార్య‌ను డిశ్చార్జి చేయాల‌ని కోరాడు. అయితే, వైద్యులు అందుకు నిరాక‌రించ‌డంతో సైలెంట్‌గా ఉన్న అత‌డు ఆ త‌ర్వాత వారి క‌ళ్లుగ‌ప్పి భార్య‌ను బిడ్డ‌ను ఇంటికి తీసుకెళ్లాడు. 

ఆ త‌ర్వాత కాసేప‌టికి గ‌మ‌నించిన ఆస్ప‌త్రి సిబ్బంది ఆందోళ‌న‌కు గురై ఉన్న‌తాధికారులకు స‌మాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పోలీసుల సాయంతో గంట‌ల వ్య‌వ‌ధిలోనే అత‌డి ఇంటిని ట్రేస్ చేశారు. ఆ త‌ర్వాత భ‌ర్త, భార్య ఇద్ద‌రిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఆస్ప‌త్రి నుంచి ఇంటికి వెళ్లే క్ర‌మంలో వాళ్లు ఎవ‌రెవ‌రిని క‌లిశారు అనే విష‌యాల‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo