సోమవారం 28 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 15:49:28

ఎంత క‌ష్టం.. అనారోగ్యంతో బాధప‌డుతున్న భార్య‌కు మంచాన్నే వాహ‌నంలా మార్చిన భ‌ర్త‌!

ఎంత క‌ష్టం.. అనారోగ్యంతో బాధప‌డుతున్న భార్య‌కు మంచాన్నే వాహ‌నంలా మార్చిన భ‌ర్త‌!

అధికారుల త‌ల‌చుకుంటే ఏవైనా చెయ్యొచ్చు కాని.. లాభం లేకుండా ఒక్క ప‌ని కూడా చేయ‌రు. ఓట్లు కోసం పుట్ట‌ల్లో దాగున్న మ‌నుషుల‌ను సైతం వెతుక్కుంటూ వ‌స్తారు. కావాల్సిన అన్ని స‌దుపాయాల‌ను అందిస్తామంటారు. తీరా ఎలెక్ష‌న్లు అయిపోయాక ఎవ‌రు మీరు అన్న‌ట్లు ఉంటారు. అందుకే మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ గ్రామంలో విద్యుత్‌, రోడ్డు, మొద‌లైన స‌దుపాయాలు క‌ల్పించాల‌ని అక్క‌డి వారంతా లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించారు. ఇలా చేస్తే ప్ర‌భుత్వం ఊరుకుంటుందా! అక్క‌డున్న స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పి చేతులు దులుపుకున్న‌ది. ఆ గ్రామ ప్ర‌జ‌ల జీవితాలు ఎప్ప‌టికీ మార‌వు.

ఆ గ్రామానికి ద‌గ్గ‌ర్లో  చిన్న హాస్పిట‌ల్ కూడా లేదు. పోనీ అంబులెన్స్ వ‌స్తుందా అంటే అక్క‌డ రోడ్డు కూడా లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఓ మ‌హిళ తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ది. హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ల‌డానికి వాహనం కూడా లేదు. దీంతో ఆమెను మంచం మీదే ప‌డుకోబెట్టి కొడుకు, మ‌న‌వ‌ల్లు సాయంతో హాస్పిట‌ల్‌కు మోసుకెళ్తున్నాడు భ‌ర్త‌. ఈ ఒక్క వీడియో చాలు అక్క‌డ‌ ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందో. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దేశంలో అవ‌స‌రం లేని విగ్ర‌హాల‌కు భారీగా ఖ‌ర్చుపెడ‌తుంటారు. వాటికి ఇచ్చే విలువ కూడా మ‌నుషుల‌కు ఇవ్వ‌డం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. 

  


logo