శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 10, 2020 , 17:55:37

రేపటి నుంచి “హునర్ హాట్” ఎగ్జిబిషన్

రేపటి నుంచి “హునర్ హాట్” ఎగ్జిబిషన్

ఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా దాదాపు 7 నెలలుగా మూతబడిన “హునర్ హాట్” ప్రదర్శన రేపు మళ్లీ ప్రారంభం కానున్నది. ఢిల్లీ హాట్ లో “హునర్ హాట్” ప్రదర్శనను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ లాంఛనంగా ప్రారంభిస్తారు. “స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యం” అన్న నినాదంతో నిర్వహిస్తున్న ఈ  ప్రదర్శనలో,.. బంకమట్టితో తయారైన సుందరమైన వస్తువులు, వివిధ లోహాలు, కలప, జనపనారతో తీర్చిదిద్దిన కళా రూపాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. బంకమట్టితో, వివిధ రకాల లోహాలతో, కలపతో తయారు చేసిన వస్తువులు, వెదురు బొంగులతో తయారైన ఉత్పాదనలు, మనసును దోచే కళాత్మకమైన కుండలు, తదితర కళారూపాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని, ఢిల్లీ హాట్ లో నవంబరు 11నుంచి 22వరకూ వాటి ప్రదర్శన,  అమ్మకాలు కొనసాగుతాయని నఖ్వీ చెప్పారు.  రెండోసారి కరోనా సోకి యువ వైద్యుడు మృతి...

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.