శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 15, 2020 , 15:07:21

మానవ హక్కుల ఉల్లంఘన సమస్యను లేవనెత్తాలి : బీఎస్‌ఎఫ్‌ ఐజీ

మానవ హక్కుల ఉల్లంఘన సమస్యను లేవనెత్తాలి : బీఎస్‌ఎఫ్‌ ఐజీ

శ్రీనగర్‌ : ఇస్లామాబాద్‌ చర్యలకు వ్యతిరేకంగా మానవ హక్కుల ఉల్లంఘన అంశాన్ని లేవనెత్తాలని కాశ్మీర్‌ బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీ) రాజేశ్‌ మిశ్రా ఆదివారం అన్నారు. ఇటీవల పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి కాల్పులు జరుపడంతో పౌరులు, వారి ఆస్థులతో పాటు తీవ్ర హాని జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాక్‌ చర్యలను ఆయన ఖండించారు. ఈ నెల 13న పాకిస్థాన్‌ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనలపై ‘అంతర్జాతీయ సమాజానికి ఏదైనా సందేశం ఉందా?’ అని ప్రస్తావించినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాల్పులతో సాధారణ పౌరులు, వారి ఆస్తులకు భారీగా నష్టం జరిగిందని తెలిపారు. బారాముల్లా జిల్లాలో పాక్‌ కాల్పుల విరమణ ఉల్లంఘనలో మరణించిన సబ్ ఇన్‌స్పెక్టర్‌ రాకేశ్ దోబల్‌కు కాశ్మీర్ ఫ్రాంటియర్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నివాళులర్పించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.