సోమవారం 21 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 02:57:56

కరోనా తీవ్రత అంచనా వేయాలి!

కరోనా తీవ్రత అంచనా వేయాలి!

  • వైరస్‌ వల్ల మరణించిన వారి వివరాలివ్వండి
  • ప్రభుత్వ సంస్థలకు నిపుణుల విజ్ఞప్తి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం ఎలా ఉన్నదో తెలుసుకోవాలంటే నమోదిత మరణాల (రిజిష్టర్డ్‌ డెత్స్‌) సమాచారాన్ని ప్రభుత్వ సంస్థలు విడుదల చేయాలని నిపుణులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దేశ, విదేశాల్లోని 200 మందికి పైగా పరిశోధకులు, అంటువ్యాధుల నిపుణులు, వైద్యనిపుణులు ఆఫీస్‌ ఆఫ్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సస్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా, స్టేట్‌ రిజిస్ట్రార్స్‌, మరణ ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే ప్రభుత్వ సంస్థలకు లేఖలు రాశారు. ‘అంటువ్యాధులు ప్రబలే ఇలాంటి సమయాల్లో ఆరోగ్య నిఘా వ్యవస్థ అప్రమత్తంగా పనిచేయాలి. అయితే, జనన, మరణాల సమాచారాన్ని నమోదు చేసే కొన్ని సంస్థలు ఆ వివరాల్ని విడుదల చేయడంలేదు. దీంతో అంటువ్యాధుల ప్రభావం ఎలా ఉన్నదో అంచనాకు రాలేకపోతున్నాం’ అని లేఖపై సంతకాలు చేసిన నిపుణులు అన్నారు. ‘మరణాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే కొవిడ్‌-19 ప్రభావం దేశంలో ఎలా ఉన్నదో అంచనాకు రావొచ్చు’ అని వెల్లడించారు.

మొదటిదశ ట్రయల్స్‌ పూర్తి: ఐసీఎమ్మార్‌ 

దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు కొవిడ్‌-19 వ్యాక్సిన్ల క్లినికల్‌ ట్రయల్స్‌ మొదటిదశ పూర్తయిందని ఐసీఎమ్మార్‌ ప్రకటించింది. భారత్‌ బయోటెక్‌, జైడస్‌ కాడిలా సంస్థలు మొదటిదశ హ్యూమన్‌ ట్రయల్స్‌ను పూర్తి చేసుకొని రెండోదశ ప్రయోగాలను మొదలుపెట్టాయని తెలిపింది.


logo