బుధవారం 05 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 10:26:48

గోర‌ఖ్‌పూర్ హాస్పిట‌ల్‌లో కోవాక్సిన్ ట్ర‌య‌ల్స్‌

గోర‌ఖ్‌పూర్ హాస్పిట‌ల్‌లో కోవాక్సిన్ ట్ర‌య‌ల్స్‌

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గోర‌ఖ్‌పూర్‌లో కోవిడ్ రోగుల‌పై కోవాక్సిన్ ట్ర‌య‌ల్స్  ప్రారంభం అయ్యాయి.  రాణా హాస్పిట‌ల్ అండ్ ట్రామా సెంట‌ర్‌లో గురువారం సాయంత్రం ట్ర‌య‌ల్స్ ప్రారంభ‌మైన‌ట్లు అధికారులు చెప్పారు.  కోవాక్సిన్ ప‌రీక్ష‌ల కోసం దేశంలో మొత్తం 12 సెంట‌ర్ల‌ను ఎంపిక చేశారు.  దాంట్లో గోర‌ఖ్‌పూర్ సెంట‌ర్ ఒక‌టి.  కోవాక్సిన్ టీకా ఇచ్చిన వారిని హాస్పిటల్ డాక్ట‌ర్లు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.  వాక్సిన్ తీసుకున్నవారంతా క్షేమంగా ఉన్న‌ట్లు హాస్పిట‌ల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ వెంక‌టేశ్ చ‌తుర్వేది తెలిపారు. ఫిజిషియ‌న్ డాక్ట‌ర్ అజిత్ ప్ర‌తాప్ సింగ్‌, గైన‌కాల‌జిస్ట్ డాక్ట‌ర్ సోనా ఘోష్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రాణా హాస్పిట‌ల్‌లో ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్నారు. గ‌తంలో ఇదే హాస్పిట‌ల్‌లో టైఫాయిడ్‌, జ‌ప‌నీస్ ఎన్‌సిఫ‌లిటిస్ వ్యాక్సిన్ల‌కు ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించారు.  భార‌త్ బ‌యోటెక్ నుంచి 34 కోవాక్సిన్ టీకాలు వ‌చ్చాయ‌ని, వాటికి హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్న‌ట్లు డాక్ట‌ర్ వెంక‌టేశ్ తెలిపారు.  


logo