మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 13, 2020 , 17:05:19

ప్రపంచంలోనే అతిపెద్ద పెన్ను.. ఎలా తయారుచేశాడో చూడండి..!

ప్రపంచంలోనే అతిపెద్ద పెన్ను.. ఎలా తయారుచేశాడో చూడండి..!

తిరువనంతపురం: కేరళకు చెందిన మహ్మద్‌ దిలీప్‌ అనే వ్యక్తి ప్రపంచంలోనే అతిపెద్ద మార్కర్‌ పెన్‌ను తయారుచేశాడు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కాడు. దీన్ని తయారుచేసే విధానాన్ని గిన్నిస్‌బుక్‌ తన అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టగా, వైరల్‌ అయ్యింది. మూడు నిమిషాల నిడివిగల ఈ వీడియోలో మహ్మద్‌ దిలీప్‌ పెన్నును ఎలా తయారుచేశాడో చూపించాడు. మొత్తం పెన్ను తయారయ్యాక దిలీప్‌ ఇతరుల సహాయంతో దాన్ని పట్టుకోవాల్సి వచ్చింది. ఈ పెన్నుతో అతడు వైట్‌బోర్డ్‌పై ‘ఇండియా’ అని రాసి, దేశభక్తిని చాటుకున్నాడు. మరి ఈ పెన్ను‌ సైజు ఎంతో తెలుసా?  2.745 మీ x 0.315 మీ ఉందట. సెప్టెంబరులో దిలీప్‌ గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కగా, ఆ సంస్థ ఇటీవల వీడియోను విడుదల చేసింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.