గురువారం 04 జూన్ 2020
National - Apr 06, 2020 , 16:30:40

శ్రీశైలంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం

 శ్రీశైలంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మహాక్షేత్రంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ ఉన్నా మద్యాహ్నం నుంచి  ఒక్కసారిగా ఆకాశంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉరుములు మెరుపులతో శ్రీశైలంలో గంటపాటు భారీ వర్షం కురిసింది.  దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు లాక్ డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రధాన రహదారులు, ఆలయ పరిసర ప్రాంతాలు నిర్మాణుషంగా మారాయి. అకాల వర్షం కారణంగా శ్రీశైలం పరిసర ప్రాంతాలు వాతావరణం చల్లడింది. ఉదయం నుంచి ఉక్కపోతకు గురైన ప్రజలు శ్రీశైలంలో భారీ వర్షం కురవటంతో  గృహాలలో ఉండి చల్లదనాన్ని . ఆస్వాదించారు.


logo