బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 07:33:20

10 అడుగుల నాగుపాము.. చూస్తే వ‌ణుకే.. వీడియో

10 అడుగుల నాగుపాము.. చూస్తే వ‌ణుకే.. వీడియో

డెహ్రాడూన్ : నాగుపాము పేరు వింటేనే ఒళ్లంతా జ‌ల‌ద‌రిస్తుంది.. అలాంటిది దాన్ని ప్ర‌త్య‌క్షంగా చూస్తే శ‌రీరంలో వ‌ణుకు పుడుతుంది. దాదాపు 10 అడుగుల పొడ‌వున్న ఓ నాగుపాము ఉత్త‌రాఖండ్  నైనిటాల్‌లోని ఓ ఇంట్లో ప్ర‌త్య‌క్ష‌మైంది. దీంతో ఆ ఇంట్లో ఉన్న‌వారంతా తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఆ ఇంటి వ‌ద్ద‌కు చేరుకుంది. ఇంట్లో ఉన్న భారీ నాగుపామును ప‌ట్టేశారు స్నేక్ క్యాచ‌ర్స్. ఆ త‌ర్వాత దాన్ని సంచిలో వేస్తుంటే.. పాము ప‌ట్టిన వ్య‌క్తి మెడ‌కు చుట్టుకుంది. మొత్తానికి ఆ నాగుపామును అక్క‌డ్నుంచి త‌ర‌లించి అడ‌విలో వ‌దిలేశారు. ఈ వీడియోల‌ను ఇండియ‌న్ ఫారెస్ట్ అధికారి ఆకాష్ కుమార్ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశారు. నాగుపాము ప‌ట్టి, వ‌దిలేసిన వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి.


logo