శుక్రవారం 29 మే 2020
National - Mar 28, 2020 , 11:40:33

వలస కూలీల తరలింపునకు 1000 ప్రత్యేక బస్సులు

వలస కూలీల తరలింపునకు 1000 ప్రత్యేక బస్సులు

లక్నో : దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో.. రోజువారి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వారి జీవితాలకు బతకడం కష్టంగా మారింది. పట్టణాల్లో జీవనం కొనసాగించలేమని భావించిన రోజువారి కూలీలు.. తమ గ్రామాలకు పయనమవుతున్నారు.

ఢిల్లీలో ఉంటున్న రోజువారి కూలీలు.. ఉత్తరప్రదేశ్‌లోని సొంత గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో కాలినడకన బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. వలస కూలీల రవాణా కోసం 1000 ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. ఆ బస్సుల్లో కూలీలను స్వస్థలాలకు తీసుకెళ్లాలని ఆదేశించారు సీఎం యోగి. ఢిల్లీ - యూపీ సరిహద్దులోని ఘజియాపూర్‌కు వందల సంఖ్యలో కూలీలు చేరుకున్నారు. పోలీసులు వారిని అక్కడే అడ్డుకుని ప్రత్యేక బస్సుల్లో పంపిస్తున్నారు. ఇక కాలినడకన వస్తున్న కూలీలకు ఘజియాపూర్‌లో స్థానికులు మానవత్వంతో స్నాక్స్‌, వాటర్‌ అందజేశారు. 


logo