మంగళవారం 31 మార్చి 2020
National - Mar 14, 2020 , 01:54:16

‘కంటెజియన్‌' సినిమాకు భారీ డౌన్‌లోడ్లు

‘కంటెజియన్‌' సినిమాకు భారీ డౌన్‌లోడ్లు

న్యూఢిల్లీ, మార్చి 13: ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా ఓ హాలీవుడ్‌ చిత్రాన్ని నెటిజన్లు విపరీతంగా డౌన్‌లోడ్‌ చేస్తున్నారు. ఆ చిత్రమే తొమ్మిదేండ్ల క్రితం వచ్చిన మెడికల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘కంటెజియన్‌'. ఈ సినిమా ఇతివృత్తం కరోనా వైరస్‌కు కాస్త దగ్గరగా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాని డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జనవరి నుంచి ఈ సినిమా డౌన్‌లోడ్లు క్రమంగా పెరిగాయి. మాట్‌ డామన్‌, లారెన్స్‌ ఫిష్‌ బర్న్‌, జూడ్‌ లా, గ్వినేత్‌ పాల్ట్రో ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ చిత్రాన్ని స్టీవెన్‌ సోడర్‌ బర్గ్‌ తెరకెక్కించారు. 2011 సెప్టెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది. 


logo
>>>>>>