బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 13:07:28

ట్రంప్ కోరుకున్న‌ట్లే.. జ‌న‌నీరాజ‌నం

ట్రంప్ కోరుకున్న‌ట్లే.. జ‌న‌నీరాజ‌నం

హైద‌రాబాద్‌:  డెబ్బై ల‌క్ష‌ల మంది జ‌నం స్వాగ‌తం ప‌లుకుతార‌ని డోనాల్డ్ ట్రంప్ త‌న ప‌ర్య‌ట‌న‌కు ముందు ఓ కామెంట్ చేశారు.  దాంతో ట్రంప్ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. అహ్మాదాబాద్‌లో జ‌రిగే రోడ్డు షోకు భారీ సంఖ్య‌లో జ‌నం వ‌స్తార‌ని మోదీనే త‌న‌కు చెప్పిన్న‌ట్లు ట్రంప్ అన్నారు. అయితే ఇవాళ అహ్మాదాబాద్ చేరుకున్న ట్రంప్‌కు.. ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.  స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ఎయిర్‌పోర్ట్ నుంచి స‌బ‌ర్మ‌తి ఆశ్రమం,  ఆ త‌ర్వాత ఆశ్ర‌మం నుంచి మొతెరా స్టేడియం వ‌ర‌కు ల‌క్ష‌లాది మంది జ‌న‌నీరాజ‌నం ప‌లికారు. అన్ని వీధుల్లోనూ న‌మ‌స్తే ట్రంప్ అంటూ నినాదాలు హోరెత్తాయి. రోడ్డు వెంట వివిధ రాష్ట్రాల‌కు చెందిన క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. 


logo