శనివారం 06 జూన్ 2020
National - May 14, 2020 , 15:15:54

భారీగా పాజిటివ్ కేసులు..త‌గ్గ‌ని ర‌ద్దీ

భారీగా పాజిటివ్ కేసులు..త‌గ్గ‌ని ర‌ద్దీ

కోయంబ‌త్తూర్ : దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మ‌రోవైపు త‌మిళ‌నాడులో కూడా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం అంత‌కంత‌కూ పెరిగిపోతుంది. ఇప్ప‌టివ‌ర‌కు త‌మిళ‌నాడులో 9227 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అయిన‌ప్ప‌టికీ జ‌నాల్లో మాత్రం ఎలాంటి భ‌యం లేదు.

సామాజిక దూరం పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి అని అధికారులు, డాక్ట‌ర్లు, పోలీసులు హెచ్చ‌రిక‌లు చేస్తున్నా ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్ర‌జ‌లు కోయంబ‌త్తూర్ లోని పూల మార్కెట్ లో నిబంధ‌న‌లు లెక్క‌చేయ‌డం లేదు. జ‌నాలంతా గుమిగూడి పూలు కొనుగోలు చేసేందుకు వ‌స్తున్నారు. ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నా కొంత మంది మాస్కులు పెట్టుకోకుండానే బ‌హిరంగ ప్ర‌దేశాల‌కు వ‌స్తున్నారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo